Sunday, January 18, 2009
పూర్వ విధ్యార్థుల సమ్మేళణ కార్యక్రమము
ఫిభ్రవరి మాసములో నా స్నేహితులు కొంతమంది కలసి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ , కేతేపల్లి పూర్వ విధ్యార్ఠుల, స్నేహితుల కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్థానికి ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానిస్తున్నానని తెలిపారు. అలాగే అదే రోజు కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టనున్నారు. త్వరలో దానికి సంబందించిన తారీఖు ఖరారు కానుంది. అలాగే ఇంకా సమాచారము అందని వారు మరియు స్నేహితులు కూడా రాగలరు.
Saturday, January 17, 2009
నేను మరియు నా గ్రామము
ఎందరో మహానుభావులు అందరికి నమస్కారములు!
ఈ బ్లాగు నేను నా గురించి మరియు నేను పెరిగిన ఊరుగురించి వ్రాయదలచుకొన్నాను.మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నా చదువు అంతా కేతేపల్లి గ్రామము లోనే జరిగింది. నా చదువు ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు సెయింట్ ఎలిజబెత్ అప్పర్ ప్రెమర్ స్కూల్ లో పూర్తి చేసాను.ఆ తరువాత ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు జిల్ల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ లో పూర్తి అయింది. అటు తరువాత ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలెజి సూర్యాపేట మరియు డిగ్రీ శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల లో చదివాను.
ఈ బ్లాగు యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యము
నేను చదువుకొన్నపుడు నా చదువంతా ప్రభుత్వ పాఠశాల మరియు ప్రభుత్వ కళాశాలల్ల్లోనే జరిగింది. కానీ దానికి కూడా ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఎందుకంటే దానికి కారణం ఆర్థిక పరిస్థితులు మాత్రమే.అయినా పట్టుదలతో నా చదువు పూర్తి చేసి అటు తరువాత అప్ఫటి రంగాన్ని శాసిస్తున్న అకౌంటింగ్, టైపు , మరియు అపుడపుడే ప్రవేశించిన కంప్యూటర్ లో శిక్షణ పూర్తి చేశాను.అటు తరువాత ఉద్యోగాలు ఎన్నో రంగాలలో చేసి ఇపుడు ఒక మంచి బి పి వో లో పనిచేస్తున్నాను.నాకు చిన్నప్పటి నుండి అంటే చదువుకునే రోజులనుండి ఒక కోరిక బాగా నాలో నాటుకు పోయింది. దానిని కోరిక అనటం కంటే ఆశయం అనవచ్చు.అది ఎమిటంటే అసలు చదువుకోవటానికి భవిష్యత్ లో కులం మతం తో సంబందం లేకుండా చదువులో శ్రద్ద ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని.నా ఆశయానికి అనుగుణంగానే నా మిత్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. వారిలో మాధవరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసు, వెంకట్, బిక్షం ముఖ్యలు.
వారికి మొదటగా నా ధన్యవాదములు. మరియు ఇతర మిత్రులు ఎవరైనా సంప్రదించాలనుకుంటే laxmi_sunny@in.com. కి మెయిల్ చేయగలరు.
Subscribe to:
Posts (Atom)